రమేష్ రెడ్డి గారి కెమెరా లోని 648 ఫోటోలు ఈ క్రింది సైట్ లో చూడగలరు
http://picasaweb.google.co.in/sikodav/SJKRameswaram2010A?feat=directlink
కొన్ని వీడియొ క్లిప్పింగులు ఈ క్రింది సైటు లో చూడగలరు
2.http://sjkramvedios.blogspot.com/
25.06.2010 రామేశ్వరం కోవెలలో వ్రాసిన పాట
ప. రామా నీకిదె వందనం రఘు
1. రామేశ్వరమున రామేశ్వరుని
2. హనుమంతుడు హిమగిరినుండి
3. అంజని సుతుడే ఆగ్రహించెనని
రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం
కామాక్షి ......19.06.2010
ప. కామాక్షీ నిను గాంచినంతనే
1. నీ నయనాలు నిలువుటద్దములు
2. కాంచీపురమున వెలసిన దేవి
3. నీకటాక్షమును జూపుము నాపై
మధుర మీనాక్షి....22.06.2010
ప. మధుర మీనాక్షికి వందనమిడరే
1. మీనాక్షి నయనాలు మన్మధ తూపుల విరులు
2. శివుడుండే కైలాసము చిన్నబోయెనెంతయో
3. పార్వతీదేవిని విడనాడ వలదనుచు
ప. హితులు స్నేహితులు సంగీత సాధకులు
1. తమిళమ్ము అనిన తమిళులకు మక్కువ
2. కంచిని మధురని ఫళనిలో మురుగని
3. పుణ్య క్షేత్రము లెల్ల దర్శించి దర్శించి
4. చీరలు నారలు చిత్రాతి చిత్రములు
కొన్ని వీడియొ క్లిప్పింగులు ఈ క్రింది సైటు లో చూడగలరు
2.http://sjkramvedios.blogspot.com/
25.06.2010 రామేశ్వరం కోవెలలో వ్రాసిన పాట
ప. రామా నీకిదె వందనం రఘు
రామా నీకిదె వందనం శ్రీ
రామా నీకిదె వందనం
1. రామేశ్వరమున రామేశ్వరుని
రమ్యముగా నెలకొలిపితివి
సైకత లింగమే స్ఫటిక లింగమై
సుందరమై కనువిందు చేసెను
2. హనుమంతుడు హిమగిరినుండి
అరుదెంచే కైలాసనాధు గొని
ఆతని రాకయే ఆలసమాయెన
అందులకేనా సైకత లింగము
3. అంజని సుతుడే ఆగ్రహించెనని
అచట నిలిపితివి విశ్వనాధుని
అదియు యిదియు దర్శనమయ్యే
అది అంతయును అద్భుతమే గద
రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం
కామాక్షి ......19.06.2010
ప. కామాక్షీ నిను గాంచినంతనే
కన్నుల వెన్నెల కురిసె గదే నా
కన్నుల వెన్నెల కురిసె గదే
1. నీ నయనాలు నిలువుటద్దములు
ముద్దుల మోమున మురిపెములు
పరమ శివుడే నీ సరి జొడు
నయగారములొలికించు నీయెడ
2. కాంచీపురమున వెలసిన దేవి
వాంఛితముల నీడేర్చు జనని
గణ నాధుడే గారాల తనయుడు
సౌభాగ్య శుభంబుల నీయగదే
3. నీకటాక్షమును జూపుము నాపై
కనికరింపవే కమలాక్షి
మాతా శాంభవి మము దీవింపవే
సుఖ సంతులు నిండుగనుండగ
రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం
మధుర మీనాక్షి....22.06.2010
ప. మధుర మీనాక్షికి వందనమిడరే
మధుర భావాల మనసు రంజింపరే
1. మీనాక్షి నయనాలు మన్మధ తూపుల విరులు
పరమశివుని హృదిలో పారిజాత సుమాలు
మీనాక్షి సన్నిధే సుందరేశు పెన్నిధాయె
కైలాస నాధుడు మధురనుండి కదలడాయె
2. శివుడుండే కైలాసము చిన్నబోయెనెంతయో
శివగణములు గణగణములు కౌమారగణములు
వడివడిగా వెడలెను మధురైనే చేరెను
మధురమధుర సువాసనలు మధురనిండ నిండెను
3. పార్వతీదేవిని విడనాడ వలదనుచు
ప్రాధేయపడుచు ప్రార్ధన చేసిరి వారు
మీనాక్షియె పార్వతియై ప్రత్యక్షమ్మాయెను
హరహరహర యనుచు హర్షధ్వానము చేసిరి
రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం
తమిళనాట పుణ్య క్షేత్రముల దర్శించె ...27.06.2010
ప. హితులు స్నేహితులు సంగీత సాధకులు
తమిళనాట పుణ్య క్షేత్రముల దర్శించె
1. తమిళమ్ము అనిన తమిళులకు మక్కువ
తమిళమ్ము తప్ప యేభాష కనరాదు
తలలు పట్టుకొని తంటాలు పడిరి
రాజ శేఖరుడే రహదారి చూపించె
2. కంచిని మధురని ఫళనిలో మురుగని
కన్యాకుమారి మరి రామేశ్వరము గనిరి
త్యాగరాజుని అడుగు జాడలను గనుచు
రమణమహర్షుల నేలనే గనిరి
3. పుణ్య క్షేత్రము లెల్ల దర్శించి దర్శించి
సంగీత సాధనము తగు రీతి చేయుచు
సేద తీర్చుకొనుచు చెన్నపురి చేరి
స్వగృహమ్ములకు సంతోషముగ జనిరి
4. చీరలు నారలు చిత్రాతి చిత్రములు
చూడంగ వచ్చిరి బంధు బాంధవులు
నచ్చిన వస్తువులు తమతోడ గొంపోవ
తెచ్చినవారేమొ తెల్లమొగమేసిరి
రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం